తాడేపల్లి: శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు మరణించిన, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు ఇవాళ వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం వెళ్లనుంది. మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ప్రతినిధి బృందం ఈ మధ్యాహ్నం 12 గం.కు కాశీబుగ్గ చేరుకుంటుంది. అక్కడ ఘటనా స్థలాన్ని సందర్శించడమే కాకుండా బాధితులను కూడా వారు పరామర్శిస్తారు. వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, నాయకులు ఉన్నారు. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిన్న తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. వైయస్ఆర్‌సీపీకి చెందిన స్థానిక నాయకులు నిన్న సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. బాధితులకు వైద్యం అందించడంలో ఎంతో పని చేశారు.