‘విద్యార్థుల కడుపు మాడ్చకండి’

అనంతపురం:

సంక్షేమ వసృతి గృహాలలోని విద్యార్థుల కడుపులు మాడ్చవద్దని వైయస్ఆర్‌ కాంగ్రెస్ విద్యార్థి విభాగం, యువత నాయకులు కోరారు. హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానిక సుభాస్ రోడ్డులోని వైయస్ విగ్రహం ఎదుట విద్యార్థులు కంచాలతో నిరసన తెలిపారు. ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థ పాలనతో హాస్టళ్ల విద్యార్థులు అలమటిస్తున్నారనీ, చదువుపై దృష్టి సారించలేక పోతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్‌పై రాయితీ ఎత్తివేయడంతో పెరిగిన భారమంతా విద్యార్థులపై పడిందన్నారు. దీంతో పౌష్టికాహారం అందడం లేదన్నారు. ఏ హాస్టల్‌లోనూ మెనూ అమలు కావడం లేదన్నారు. మెస్ చార్జీల మొత్తం గ్యాస్ సిలిండర్లకే సరిపోతోందన్నారు. విద్యార్థులు స్వచ్ఛందంగా వసతి గృ హాలు వీడేలా చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెస్‌ చార్జీలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

Back to Top