ద్వారకాతిరుమలకు పార్టీ శ్రేణుల పాదయాత్ర

వీరవాసరం (ప.గో.జిల్లా) :

పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం నుంచి ద్వారకా తిరుమల వరకూ పార్టీ నాయకులు, శ్రేణులు పాదయాత్ర ప్రారంభించారు. భీమవరం వైయస్ఆర్‌ కాంగ్రెస్ నియోజకవర్గ‌ం సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్రను శనివారం నాడు పార్టీ ఎమ్మెల్సే మేకా శేషుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి బెయిల్‌ను అడ్డుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కుళ్లు రాజకీయాలకు పాల్పడుతున్నారని శేషుబాబు, శ్రీనివాస్ ధ్వజమెత్తారు.

గతంలో కూడా బెయి‌ల్ పిటిష‌న్ కోర్టు ముందుకు వ‌చ్చిన తరుణంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం సహా కాంగ్రెస్ ముఖ్య నేతలను‌ చంద్రబాబు కలిసిన విషయాన్ని వారు గుర్తుచేశారు. మహానేత వైయస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని దుయ్యబట్టారు. ఆ పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ఆ పార్టీలకు బుద్ధిచెబుతారని వారు తెలిపారు. ఈ సందర్భంగా వీరవాసరానికి చెందిన పలువురు శేషుబాబు, గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

తాజా వీడియోలు

Back to Top