వైయస్‌ జగన్‌తో గోపాల్‌రెడ్డి భేటి

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి అభ్యర్థిగా ఎన్నికైన వెన్నపూస గోపాల్‌రెడ్డి కలిశారు. శుక్రవారం అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో తనను కలిసిన గోపాల్‌రెడ్డిని వైయస్‌ జగన్‌ అభినందించారు. ఆయనకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ సమస్యలపై శాసన మండలిలో గళం వినిపించాలని గోపాల్‌రెడ్డికి వైయస్‌ జగన్‌ సూచించారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు.

Back to Top