విడ‌ద‌ల ర‌జ‌నీ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌


విశాఖ‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వివిధ పార్టీల నాయ‌కులు ఆక‌ర్శితుల‌వుతున్నారు. నిత్యం ఏదో ఒక పార్టీ నుంచి కీల‌క‌మైన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారు. ఇటీవ‌ల రిటైర్డు ఎస్పీ ప్రేమ్‌బాబు వైయ‌స్ఆర్‌సీపీలో చేర‌గా, తాజాగా చిల‌క‌లూరిపేట‌కు చెందిన విడ‌ద‌ల ర‌జ‌నీ వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. గురువారం ఉద‌యం విశాఖ జిల్లా య‌ల‌మంచ‌లి నియోజ‌క‌వ‌ర్గంలోని రేగుపాలెం జంక్ష‌న్ వ‌ద్ద జ‌న‌నేత‌ను వెయ్యి మంది అనుచ‌రుల‌తో క‌లిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. 
Back to Top