హైదరాబాద్: మద్యం వ్యాపారం చేయాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆలోచనలు దుర్మార్గమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు మద్యాన్ని నియంత్రిస్తానన్న చంద్రబాబు ఇప్పుడెందుకు మాట మార్చారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నట్లు జీవో ఇచ్చారని, అయితే ఇప్పటికీ ఒక్క బెల్ట్ షాపు కూడా రద్దు కాలేదని ఆమె గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబుచేసిన మొదటి అయిదు సంతకాలు ఏమయ్యాయని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.<br/>గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని, ప్రభుత్వమే సమీక్షలు నిర్వహించి మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం అతి దారుణమని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక బెల్ట్షాపులు అన్న పదమే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మహిళల ఓట్లతో అధికారం పొందిన చంద్రబాబు ఇప్పుడు వారికి క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.<iframe width="700" height="400" src="https://www.youtube.com/embed/ZCuolSkcaLE" frameborder="0"/>