వ‌రుస త‌ప్పిదాలు......!

1. మొత్తం ప‌నుల్ని చంద్ర‌బాబు అండ్ కోట‌రీ స‌భ్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే జ‌రిగింది. ఆయ‌న‌కు కావాల్సిన మంత్రుల ఆధ్వ‌ర్యంలోనే ప‌నులు జ‌రిగాయి. ఇత‌రుల్ని ఇందులోకి రానివ్వ‌లేదు. ఎందుక‌ని.......
2. పుష్క‌రాల విష‌యంలో వెయ్యి కోట్ల‌కు పైగా అవినీతి జ‌రిగింద‌ని ప్ర‌తిప‌క్షాల‌నీ ముక్త కంఠంతో నిన‌దించాయి. అయినా స‌రే, ప్ర‌భుత్వం ఎందుకు ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లింది.
3. ప్ర‌చారం కోసం విప‌రీతంగా ఖ‌ర్చు పెట్టిన ప్ర‌భుత్వం ఏర్పాట్లు విష‌యం ఎందుకు ప‌ట్టించుకోలేదు.
4. ఎక్కువ మంది భ‌క్తులు వ‌చ్చార‌ని ఇప్పుడు గ‌గ్గోలు పెడుతున్నారు. రాజ‌మండ్రికి అధిక సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తార‌ని, పుష్క‌రాల రేవులోనే స్నానాలు ,చేస్తార‌ని అంద‌రికీ తెలుసు. ఈ సంగ‌తి ఎందుకు అంచ‌నా వేసుకోలేదు.
5.అంతా కోట‌రీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ప‌నులు చేసుకొన్నారు త‌ప్పితే క‌నీసం జిల్లా వ్యాప్తంగా ఉండే ఎమ్మెల్యేలు అంద‌రితో కానీ, స్థానిక ప్ర‌జా ప్ర‌తినాధుల‌తో కానీ స‌మావేశం పెట్టుకొన్నారా... అఖిల ప‌క్షాన్ని పిలిచి అభిప్రాయాలు తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేశారా.....!
6.ముఖ్య‌మంత్రి కుటుంబానికి వీఐపీ ఘాట్ వ‌దిలి పుష్క‌రాల రేవులో పూజ‌లు ఎందుకు జ‌రిపించిన‌ట్లు.....!
7. దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు భ‌క్తుల్ని న‌డిరోడ్డుమీద ఎందుకు నిలిపివేసిన‌ట్లు ..........!
8. వేలాది భ‌క్తులు సీసీ టీవీల్లో క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ఒక్క‌సారిగా భ‌క్తుల్ని రేవుల్లోకి వ‌ద‌ల‌టం ఎందుకు జ‌రిగింది..........!
9.ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయ‌డానికి యంత్రాంగం మొత్తం అక్క‌డే గుమిగూడ‌లేదా..........!
10. చంద్ర‌బాబు వెళ్లిపోగానే ఆయ‌న కూడా యంత్రాగం మొత్తం ప‌రిగెత్తింది క‌దా....!
11. ద‌గ్గ‌ర‌లో అంబులెన్సులు కూడా ఎందుకు క‌నిపించ‌టం లేదు...........!
12. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయ‌టంలో ఎందుకు నిర్లక్ష్య‌యం వ‌హించారు..!
13. క్ష‌త‌గాత్రుల్ని వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లి ఉంటే క‌నీసం కొంద‌రి ప్రాణాలు అయినా ద‌క్కేవి కావా........!
14. తాగ‌టానికి సుర‌క్షిత నీరు లేద‌ని ఎంత మొత్తుకొంటున్నా, ఎందుకని స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌పోయారు.
15. మొత్తం ప‌బ్లిసిటీ పిచ్చి త‌ప్పితే ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ ప‌డే ప‌ని ఎందుకు చేయ‌లేక‌పోతున్నారు......!
Back to Top