వర్షాభావంపై వైయస్‌ఆర్‌ సిపి వాయిదా తీర్మానం

హైదరాబాద్, 21 సెప్టెంబర్‌ 2012: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై సభలో వెంటనే చర్చ జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారంనాడు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. శాసనసభ వర్షాకాల సమావేశాల నాలుగవ రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం అయిన వెంటనే పార్టీ తన వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. కాగా, ఇతర ప్రతిపక్షాలు కూడా వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెం‌ట్పై టీడీపీ, తెలంగాణపై తీర్మానం చేయాలటూ టీఆర్ఎస్, బీజేపీ, విద్యు‌త్ కొరతపై సీపీఐ, స్థానిక సంస్థల ఎన్నికల‌ నిర్వహణలో జరుగుతున్న జాప్యంపై ఎంఐఎం పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అయితే,‌ వాయిదా తీర్మానాలను స్పీకర్ యధావిధిగా తిరస్కరించారు. దీనితో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొన్నది. విపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనల మధ్య సభ గంటసేపు వాయిదా పడింది.

Back to Top