వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తాం : జగన్

‌చౌడేపల్లి (చిత్తూరు జిల్లా):

దివంగత మహానేత, తన తండ్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి హామీ ‌ఇచ్చిన విధంగా తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వాల్మీకి కులస్తులను ఎస్‌టీ జాబితాలో చేరుస్తామని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం చౌడేపల్లెలో తనను కలసిన వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పొదల నరసింహులు నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు.‌ ‌వాల్మీకుల డిమాండ్ సమంజసమైనదని, తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జరిగే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే సంబంధిత బిల్లును ఆమోదిస్తామని చెప్పారు.

వాల్మీకి కులస్థులను ఎస్‌టీలుగా చేర్చాలన్న అంశాన్ని పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా ఉంచామని శ్రీ జగన్‌ అన్నారు. పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, నారాయణస్వామి నేతృత్వంలో వాల్మీకి సంఘం నేతలు బొగ్గిట కృష్ణమూర్తి, హరికృష్ణ శ్రీ జగన్‌ను కలిశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top