వైయస్ పాదయాత్రతో ‌చంద్రబాబుకు పోలికే లేదు

ఆనందపురం (విశాఖజిల్లా), 16 అక్టోబర్‌ 2012: ప్ర‌జల సమస్యలు వారి నుంచే సవివరంగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చేయడం కోసం మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చే‌శారని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పి. బాలరాజు గుర్తుచేసుకున్నారు. అయితే, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం అధికార దాహంతో పాదయాత్ర పేరుతో తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు చేస్తున్న పాదయాత్రకు, వైయస్ పాదయాత్రకు అస్సలు పోలికే లేదన్నారు. విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం పెద్దిపాలెంలో సోమవారం జరిగిన మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో బాలరాజు పాల్గొన్నారు. రాజశేఖరరెడ్డి తన పాదయాత్రలో టీడీపీ దుర్మార్గ పాలనను ఎండగట్టారన్నా రు. అధికార‌ దాహంతో బాబు చేస్తున్న పాదయాత్రను ఎవరూ విశ్వసించడం లేదన్నారు.

Back to Top