వైయస్ జగన్ విడుదల కావాలి

హైదరాబాద్ : వైయస్ జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాలని ఆక్షాంక్షిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రీంకోర్టులో జగన్కు బెయిల్ రావాలంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్ని ప్రసిద్ద ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మంలోని స్తంబాద్రి ఆలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం కార్యకర్తలు అరసవల్లి సూర్యదేవాలయంలో గురువారం 1,101 కొబ్బరికాయలు కొట్టారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అర్చన చేయించారు. జగన్‌ త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతారని పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్లో జగన్ క్షేమం కోరుతూ పార్టీ నేతల ఆధ్వర్యంలో సర్కస్ గ్రౌండ్ నుంచి మంకమ్మ తోట వరకూ పాదయాత్ర చేశారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు పొర్లు దండాలు పెట్టారు.  జగన్ క్షేమం కోరుతూ హైదరాబాద్లో అంబర్ పేట నుంచి జీడీ కాలనీ వరకు వైయస్ఆర్ సీపీ నేతల ర్యాలీ నిర్వహించారు. అనంతరం 250 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

జగన్ బెయిల్ కోసం కార్యకర్తల పాదయాత్ర
హైదరాబాద్ : వైయస్‌ జగన్‌కు సుప్రీంకోర్టులో బెయిల్‌ రావాలని ఆకాంక్షిస్తూ రంగారెడ్డి జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ  కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. రాజేంద్రనగర్‌ మండలం కాళీ మందిర్‌ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి గురువారం పాదయాత్రను ప్రారంభించారు. చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు పాదయాత్ర సాగుతుందని ఆయన చెప్పారు. అంతకుముందు కాళీ మందిర్‌లో ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Back to Top