వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి

హైదరాబాద్, 14 డిసెంబర్ 2012:

ప్రజా సమస్యల పరిష్కారం కోసం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి తాము అండగా ఉంటామన్నారు. కాసానితోపాటు జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్ చంచల్‌గూడ జైలులో ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డిని శుక్రవారం ఉదయం కలిశారు.

     అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై సమాజాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని శ్రీ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మహానేత అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం నీరుగార్చుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అటకెక్కించారని వారు ధ్వజమెత్తారు. త్వరలో తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో ఆ తేదీ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మహానేత వైఎస్‌ఆర్‌ పాలనను మరచిపోలేకపోతున్నారని వారు గుర్తు చేశారు.

తాజా వీడియోలు

Back to Top