వైయస్‌ఆర్‌టియుసి ఫోటోగ్రాఫర్ల సంఘం ఏర్పాటు

హైదరాబాద్ :

వైయస్‌ఆర్‌‌ ట్రేడ్ యూనియన్‌ కాంగ్రెస్‌ అనుబంధ ఫోటో అండ్‌ వీడియో గ్రాఫర్ల యూనియన్‌ ఏర్పాటైంది. ఈ యూనియన్‌ రాష్ట్ర కమిటీని బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి.జనక్‌ ప్రసాద్ ప్రకటించారు. కమిటీలో మొత్తం 43 మంది సభ్యులున్నారు.

వైయస్‌ఆర్‌‌ ట్రేడ్ యూనియన్‌ కాంగ్రెస్‌ అనుబంధ ఫోటో అండ్‌ వీడియో గ్రాఫర్ల యూనియన్‌ అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన వోడ్నాల సతీష్‌ నియమితులయ్యారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కె.ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా వై.బి. మహేశ్వర్ రెడ్డి, ఎస్‌. ‌బ్రహ్మారెడ్డి, ఆర్‌. రాజు, ప్రధాన కార్యదర్శిగా బి.రాఘవేంద్రనాయుడు, కోశాధికారిగా ఎం.రాజును నియమించారు. మరి కొందరు సంయుక్త కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు.

Back to Top