వైయస్‌ఆర్‌సిపి నాయకులపై టిఆర్ఎ‌స్ దాడి

జమ్మికుంట‌ (కరీంనగర్‌ జిల్లా) : తెలంగాణ బంద్ ‌సందర్భంగా కరీంనగర్ జమ్మికుంటలో‌ శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. వైయస్‌ఆర్‌సిపి నాయకులపై టిఆర్‌ఎస్ నాయకులు మూకుమ్మడిగా దాడి‌ చేశారు. కేంద్రప్రభుత్వం తీరుపై టిఆర్ఎ‌స్ నాయకులు శుక్రవారం సాయంత్రం గాంధీ చౌ‌క్ వద్ద దిష్టిబొమ్మతో‌ పాటు పక్కనే ఉన్న వైయస్‌ఆర్‌సిపి ఫ్లెక్సీలను కూడా చింపి దగ్ధం చేశారు. టిఆర్‌ఎస్‌ తీరును నిరసిస్తూ శనివారంనాడు వైయస్‌ఆర్‌సిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణ ఇన్‌చార్జి సిఐ వీరభద్రం అక్కడకు చేరుకుని ఆందోళన చేయొద్దని సూచిస్తుండగానే.. పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన టిఆర్ఎ‌స్ నాయకులు ఇ‌ష్టం వచ్చినట్లు దూషిస్తూ వైయస్‌ఆర్‌సిపి విద్యార్థి విభాగం నాయకుడు అయిత అరుణ్, పార్టీ మండల అధ్యక్షుడు చర్లపల్లి శ్రీనివా‌స్‌పై దాడి చేశారు.

ఒక పక్కన సిఐ వీరభద్రం, పోలీసులు అడ్డుకున్నా వారిని తోసుకుని వచ్చి అయ్యప్పమాలలో ఉన్నాడని కూడా చూడకుండా శ్రీనివాస్‌ను దుర్భాషలాడారు. ఆ సమయంలో వైయస్‌ఆర్‌సిపి నాయకులు పదిమంది మాత్రమే ఉండగా.. టిఆర్ఎ‌స్ వారు వందమందికి పైగా ఉన్నారు. ఘర్షణ తీవ్రం కావడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. వై‌యస్‌ఆర్‌సిపి నాయకులను రక్షించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

'పోలీసులు లేకపోతే చంపేసేవారు' :
పోలీసులు అడ్డుడకపోయి ఉంటే టిఆర్ఎ‌స్ నాయకులు తమను చంపేసేవారని వైయస్‌ఆర్‌సిపి మండల అధ్యక్షుడు శ్రీనివాస్, అయిత అరు‌ణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గూండాల్లా వ్యవహరించి ఇష్టంవచ్చిన రీతిలో దాడిచేశారని తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి జనం నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టిఆర్ఎ‌స్ నాయకులు‌ పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని వారు విమర్శించారు.
Back to Top