వైయస్‌ఆర్‌సిపిలోకి పాలమూరు కాంగ్రెస్‌ నాయకుడు

హైదరాబాద్‌, 19 నవంబర్‌ 2012: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు దామోదర్‌రెడ్డి సోమవారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి, ‌మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. దామోదర్‌రెడ్డితో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్‌లు కూడా వైయస్‌ఆర్‌సిపిలో చేరారు.
Back to Top