'వైయస్‌ఆర్‌సిపి గెలిచే చోటల్లా ఎన్నికలపై స్టే'

కడప, 20 ఫిబ్రవరి 2013 : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న స్థానాలన్నింటిపైనా కిరణ్‌ ప్రభుత్వం స్టే విధించిందని పార్టీ విప్‌, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కడప డిసిసిబి చైర్మన్‌ పదవిని వైయస్‌ఆర్‌సిపి గెలుచుకోవడం తథ్యమని తేలడంతోనే ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాయం చేశారని ఆయన దుయ్యబట్టారు. అధికారులు కూడా అధికార కాంగ్రెస్‌ పార్టీ కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప డిసిసిబి చైర్మన్ ఎన్నిక‌ సక్రమంగా జరగనిస్తారన్న విశ్వాసం తమకు లేదని బాలినేని ఆందోళన వ్యక్తం చేశారు.
Back to Top