వైయస్ఆర్ సీపీలో చేరిన ముస్లిం సో దరులు

చిత్తూరు:

కుళ్లు కుతంత్రాలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఏఎస్.మనోహర్ పిలుపునిచ్చారు. చిత్తూరు నియోజకవర్గం బీ.నరసింగరాయని పేటలో 100 మందికి పైగా ముస్లింలు మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్నా, అక్తర్, అక్బర్‌బాషా, సయ్యద్‌బాషా, గౌస్, జమాల్, ఇలియాజ్, ఇమ్రాన్, బాషా ఆధ్వర్యంలో మనోహర్ ముస్లింలకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం  చారు. మనోహర్ మాట్లాడుతూ కాంగ్రె స్, టీడీపీ కుమ్మక్కై తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా చేశాయని ఆరోపించారు. సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లా కాకుండా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా వ్యవహరిస్తోందని విమర్శించారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మహానేత రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. అనంతరం వచ్చిన ముఖ్యమంత్రుల చేతగాని తనంవల్ల ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు అమలుకు నోచుకోలేదని తెలిపారు. మళ్లీ ఆ రిజర్వేషన్లు అమలు కావాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాలేదని అధైర్యపడవద్దని, వచ్చే వరకు ఆయన తల్లి విజయమ్మ, షర్మిల ముందుండి పార్టీని నడిపిస్తారని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

Back to Top