వైయస్‌ఆర్‌సీపీలో 300 మంది కార్యకర్తల చేరిక

హైదరాబాద్‌, 10 సెప్టెంబర్‌ 2012: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నుంచి వివిధ పార్టీలకు చెందిన 300 మంది కార్యకర్తలు సోమవారం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. మండలంలోని బోగారంలో జరిగిన కార్యక్రమంలో వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్థనరెడ్డి ఆ‌ధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ‌వైయస్ రాజశేఖ‌ర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని, ‌ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు పలకడంవల్లే తామంతా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌లో చేరినట్లు కొత్తగా పార్టీలో చేరిన వారు తెలిపారు.
Back to Top