వైయస్ఆర్ సీపీ ధరాగ్రహం

ఆదిలాబాద్: డీజిల్ ధర పెరుగుదల, ఆర్టీసీ చార్జీల మోత, వంటగ్యాస్ సిలిండర్లు ఆరింటికి పరిమితం చేయడాన్ని నిరసిస్తూ రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బస్టాండ్ నుంచి జాతీయ రహదారి మీదుగా తెలంగాణ చౌక్, కొమురం భీం చౌక్ గుండా భారీ ర్యాలీతో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ మాట్లాడారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ధరలు పెంచుతూ బడుగుల నడ్డి విరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఏవో శివకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ మహిళా సమాఖ్య గ్రామ పంచాయతీ అధ్యక్షురాలుగా 12 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కుంజాపురే శోభతోపాటు పలువురు మహిళలు పార్టీ చేరారు. వీరికి బోడ జనార్దన్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రె స్ పార్టీ రాష్ట్ర నాయకురాలు విజయశ్రీ, జిల్లా కో-కన్వీనర్ రవిప్రసాద్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అఫ్జలుద్దీన్, జిల్లా కో-కన్వీనర్ రవిప్రకాష్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సలీంపాషా, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవల్ రణధీర్ సిన్హా (బన్ను), ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్‌కుమార్, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆదిలాబాద్ పట్టణ శాఖల అధ్యక్షులు శ్రీనివాస్, సాబీర్ హుస్సేన్, ఫారూక్ రంజానీ, రైతు సంఘం నాయకులు రాధకృష్ణ, కాగజ్‌నగర్, మంచిర్యాల, ఉట్నూర్, ఇంద్రవెల్లి, తాండూర్, దండేపల్లి మండల శాఖల కన్వీనర్లు బ్రహ్మయ్య, రవికుమార్, వ కలీం, రవి, రాంచందర్ పఠాన్, గడ్డం రాంచందర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వినాయక్‌రెడ్డి, మోహినోద్దీన్, ధోని జ్యోతి, శోభ, మహిపాల్ రెడ్డి, బి.వి. ప్రసాద్, కృష్ణ మీనన్ యాదవ్, సతీష్‌వైద్య, జ్యోతి, ప్రభాస్ నాయక్, గంగారెడ్డి, ప్రసాద్, ఊరటి వినోద్ కుమార్, రోహిత్ పాల్గొన్నారు.


ఆర్టీసీ చార్జీల పెంపుపై వైయస్‌ఆర్‌సీపీ ధర్నా
నగరి: ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఆర్‌కే రోజా ఆధ్వర్యంలో బుధవారం నగరిలో ధర్నా నిర్వహించారు. దీనికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా మహిళాధ్యక్షురాలు గాయత్రీదేవి, జిల్లా యువత అధ్యక్షుడు ఉదయకుమార్, సత్యవేడు ఇన్‌చార్జి ఆదిమూలం హాజరయ్యారు. ఉదయం నగరిలోని టవర్‌ క్లాక్ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించారు. మండుటెండలో సైతం రెండు గంటల పాటు కార్యకర్తలతో కలిసి నాయకులు ధర్నా చేశారు. చార్జీలు పెంపు, గ్యాస్ కుదింపు, విద్యుత్ కోతలపై నాయకులు ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రసంగించారు. ప్రజలు కూడా వైయస్‌ఆర్‌సీపీకి మద్దతు తెలుపుతూ ధర్నాలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్, నిండ్ర జెడ్పీటీసీ మాజీ సభ్యులు చక్రపాణిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు లక్ష్మీపతిరాజు, హిమజ విద్యాసంస్థల చైర్మన్ సురేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో..
కాకినాడ: డీజిల్ ధరల పెంపుదలను సాకుగా తీసుకుని భారీగా పెంచిన ఆర్టీసీ బస్‌చార్జీలను ఉపసంహరించాలనే డిమాండ్‌తో వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తలు కదం తొక్కారు. జిల్లా నలుమూలల నుంచీ వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట దాదాపు మూడు గంటల పాటు ధర్నా చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాయి. ఆర్టీసీ చార్జీల పెంపు, విద్యుత్ కోతలు, డీజిల్ ధరల పెరుగుదల, గ్యాస్‌పై నియంత్రణ వంటి తప్పుడు నిర్ణయాలపై ప్రజాగ్రహం చవిచూడక తప్పదంటూ నేతలు హెచ్చరించారు. ఉదయం 10 గంటల నుంచే పార్టీ నేతలు, కార్యకర్తలు కాకినాడ కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్కచేయక పార్టీ జెండాలు చేతబూని ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఏమైనా తగ్గాయంటే.... ఆరోగ్యశ్రీలోకి వచ్చే వ్యాధులను తగ్గించడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తగ్గించడం, పెరిగే వాటిలో... గ్యాస్, నిత్యావసరాలు, డీజిల్, బస్‌చార్జీల ధరలేనంటూ ఎద్దేవా చేశారు. మరో సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు బ్లాక్‌మార్కెట్‌కు తరలడం, నిత్యావసరాలు ఆకాశన్నంటడంతో సామాన్యుడి బతుకు దుర్భరంగా మారిందన్నారు. మరో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘బాదుడు’ సర్కార్‌గా అభివర్ణించారు.

కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ మరణం తరువాత పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మాట్లాడుతూ కేంద్రంలోను, రాష్ట్రంలోనూ పాలన అస్తవ్యస్థంగా మారి ప్రభుత్వాలను నిలబెట్టుకునేందుకు లాబీయింగ్‌లతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ నేతలు పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.

మరో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ అన్ని రకాల ధరల పెరుగుదలతో సామాన్యుడిపై పడుతోన్న భారాన్ని తగ్గించే వరకు ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉద్యమించాలన్నారు. కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాలకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. జిల్లా అధికార ప్రతినిధులు అత్తిలి సీతారామస్వామి, పీకే రావు మాట్లాడుతూ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశాయన్నారు. జిల్లా మహిళా విభాగం కన్వీనర్ రొంగలి లక్ష్మి మాట్లాడుతూ ఏడాదికి ఆరేడుసార్లు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర ధరల పెరుగుదలకు ప్రభుత్వమే కారణమవుతోందన్నారు. జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు మాట్లాడుతూ ధరలు తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి వస్తే వైఎస్ హయాంలో ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరించేదన్నారు.
జిల్లా బీసీ సెల్ కన్వీనర్ గుత్తుల రమణ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకించాల్సిన టీడీపీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందని ధ్వజమెత్తారు. జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయ్‌భాస్కర్, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రభావం వల్ల చిల్లర వర్తకులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఎదురువుతుందన్నారు. జిల్లా నలుమూలల నుంచీ విచ్చేసిన నేతలను జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు వేదికపైకి ఆహ్వానించారు. ధర్నా అనంతరం పెంచిన ఆర్టీసీ చార్జీలు ఉపసంహరించాలని కోరుతూ జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.రామారావుకు పార్టీనేతలు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్, కిసాన్ సెల్ కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, జిల్లా చేనేత, లీగల్, మైనార్టీ, వికలాంగుల సెల్స్ కన్వీనర్లు పంపన రామకృష్ణ, మట్టపర్తి మురళీకృష్ణ, నయీం, నలమాటి లంకరాజు, తుని నియోజకవర్గ ఇన్‌చార్జి దాడిశెట్టి రాజా, రాజమండ్రి యువజన విభాగం అధ్యక్షుడు గుర్రం గౌతమ్, నీటి సంఘాల ప్రతినిధి కొవ్వూరి త్రినాధ్‌రెడ్డి, పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, జ్యోతుల నవీన్, తోటసుబ్బారావు నాయుడు, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, భూపతిరాజు సుదర్శనబాబు, కాళే రాజబాబు, పెన్మత్స చిట్టిరాజు, విత్తనాల వెంకటరమణ, శెట్టిబత్తుల రాజబాబు, మందపాటి కిరణ్‌కుమార్, రావిపాటి రామచంద్రరావు, మార్గాని రామకృష్ణగౌడ్, సత్తి వీర్రెడ్డి, కర్రి శేషారత్నం, మట్టా శైలజ, సిరిపురపు శ్రీనివాసరావు, ఆర్‌వీవీ సత్యనారాయణ చౌదరి, గుబ్బల వెంకటేశ్వరరావు, జాన్ ప్రభుకుమార్, అడ్డూరి ఫణీష్, డాక్టర్ యనమదల గీత మురళీ కృష్ణ, మట్టపర్తి నాగేంద్ర, ఎల్ శాంతి, అడ్డగర్ల సాయిరాం, మద్దా చంటి, కొయ్యా రామకేశవ్, కుసనం దొరబాబు పాల్గొన్నారు.

గుంటూరు కలెక్టరేట్ వద్ద
గుంటూరు: ప్రభుత్వ విధానాలతో సామాన్యుడు జీవించే పరిస్థితి కనిపిం చడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత విమర్శించారు. ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలను తగ్గించాలని నినాదాలు చేస్తూ అరండల్‌పేట ఐదో లైను నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై తీవ్ర భారం మోపా యని దుయ్యబట్టారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలు పెంచడం తగదన్నారు. పెంచిన చార్జీలను తగ్గిం చేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నుల భారం, చార్జీల భారం మోపడమే ధ్యేయంగా పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నాయన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  రాజశేఖరరెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఎటువంటి చార్జీలను పెంచలేదని గుర్తుచేశారు. వైయస్ఆర్ తర్వాత అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి మూడుసార్లు ఆర్టీసీ చార్జీలను, మూడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచిందన్నారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ అధికార పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేకవిధానాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ పెంచిన చార్జీలను తగ్గించేవరకు పార్టీపరంగా ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గుదిబండి వెంకట రెడ్డి, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు కోన రఘుపతి, నాయకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, నన్నపనేని సుధ, మందపాటి శేషగిరిరావు, యువజన విభాగం ఐదు జిల్లాల కో ఆర్డినేటర్ వనమా బాలవజ్రబాబు, యువజన విభాగం నగర కన్వీనర్ ఎండీ నసీర్ అహ్మద్, నాగభూషణరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ షౌకత్, మహిళా నేతలు సునీత, జయలక్ష్మి, నాగమణి, ట్రేడ్‌యూనియన్ జిల్లా, నగర కన్వీనర్లు అన్నాబత్తుని సదాశివరావు, గులాం రసూల్, రత్నప్రసాద్, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ మహబూబ్, నూతలపాటి హనుమయ్య, గుత్తికొండ అంజిరెడ్డి, ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, లోయ తాండవకృష్ణ, షేక్ అల్తాఫ్, అత్తోట జోసఫ్‌కుమార్, కొరిటపాటి ప్రేమ్‌కుమార్, ఎం.దేవరాజ్, మౌలాలి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ దేవెళ్ల రేవతి, యువజన విభాగం నాయకులు దాది మురళి, రవిశంకర్‌చౌదరి, అరవింద్, సుశీల్, మారురి రామలింగారెడ్డి, హనుమంత్‌నాయక్ విద్యార్థి నేతలు దర్శనపు శ్రీనివాస్, యు.నర్శిరెడ్డి, మండలాల పార్టీ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బస్ చార్జీలు తగ్గించాలని కోరుతూ పార్టీ నేతలు కలెక్టరేట్‌లోని ఏవో ఎన్.ఏసురత్నంకు వినతిపత్రం అందజేశారు.
భారీగా ప్రదర్శన: పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నేతృత్వంలో అరండల్‌పేట ఐదో లైన్ నుంచి ప్రారంభమైన నిరసన ప్రదర్శన శంకర్‌విలాస్‌సెంటర్, ఓవర్‌బ్రిడ్జి, ఏసీ కాలేజి, హిందూ కాలేజి సర్కిల్, నగరంపాలెం మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎదుట ధర్నా చేపట్టారు.

Back to Top