‘వైయస్ఆర్ సీపీ’ అభివృద్ధికి కృషి చేయండి

కడప: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకులు సుధాకర్‌రెడ్డి కోరారు. వైయస్ అతిథి గృహంలో పార్టీ అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లతో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకటిన్నర సంవత్సరకాలంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తుమన్నారు. మొదట్లో ఒక క్రమపద్ధతిలో జరగక కొన్ని సమస్యలు తలెత్తాయన్నారు. అనుబంధ విభాగాల అధ్యక్షులు మండలాలకు, అవసరమైతే పంచాయతీకి వెళ్లి కమిటీలు తయారు చేయాలన్నారు. కమిటీ సభ్యులంతా క్రియాశీలక సభ్యులై ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 20వ తేదీలోపు కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండాలన్నారు. టీడీపీకి ఆరణ లేకపోయినా ఆ పార్టీ ఇంకా మనగలుగుతుందంటే పార్టీ నిర్మాణమే కారణమన్నారు. జగన్‌కు బెయిల్ వస్తే చంద్రబాబు పాదయాత్రకు విలువ ఉండదనే ఉద్దేశ్యంతోనే రాకుండా చేశారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రతి మండలంలో పార్టీకి సంబంధించిన స్టీరింగ్ కమిటీ, 19 అనుబంధ విభాగాల కమిటీలు ఉండాలన్నారు.
జిల్లా అధ్యక్షులంతా మండలాల్లో పర్యటించి స్థానిక ఎమ్మెల్యే, మండల కన్వీనర్లతో కలిసి కమిటీలు వేయాలన్నారు.
పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాలంటే గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం బలంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నగర కన్వీనర్ ఎస్‌బీ అంజద్‌బాష, టీకే అఫ్జల్‌ఖాన్, హఫీజుల్లా(కాల్‌టెక్స్), వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జిఎన్‌ఎస్ మూర్తి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ పులి సునీల్, ఎస్టీ సెల్ కన్వీనర్ వేణుగోపాల్ నాయక్, మైనార్టీ విభాగం కన్వీనర్ ఎస్‌ఎ కరీముల్లా, జానకీరామయ్య, పత్తి రాజేశ్వరి, యానాదయ్య, కోటా నరసింహారావు, టీపీ వెంకటసుబ్బమ్మ, పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top