వైయస్ఆర్‌ మృతి వెనుక కుట్ర:మారెప్ప

అనంతపురం, 25 నవంబర్ 2012: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిది ముమ్మాటికీ హత్యేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి మూలింటి మారెప్ప అన్నారు. వైయస్ఆర్ మరణం వెనుక కుట్ర దాగుందన్నారు. వైఎస్ రాజశేఖరెడ్డి మరణంపై త్యాగి ఇచ్చిన నివేదికను మంత్రి మండలి ఆమోదించడం దారుణమని మారెప్ప అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా మృతి చెందారో ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలుసునని ఆయన అన్నారు.

Back to Top