వైయస్ఆర్ హయాంలోనే హంద్రీ నీవాకు రూపకల్పన

ధర్మవరం (అనంతపురం జిల్లా) :

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హంద్రీ నీవా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు గిర్రాజు నగేష్ అన్నారు. మహానేత కష్టపడి సాధించిన పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.

పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నగేష్‌తోపాటు మైనారిటీ రాష్ట్ర నాయకుడు ముస్తక్ అహ్మద్, ధర్మవరం నియోజక వర్గం ఇన్‌చార్జీ తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అన్నదాతలకు మేలు చేయాలనే లక్ష్యంతో కృష్ణానది మిగులు జలాలను హంద్రీ నీవా ద్వారా అనంతపురం జిల్లాకు తరలించాలని బృహత్తర పథకాన్ని రూపొందించారని చంద్రశేఖరరెడ్డి అన్నారు.  కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్రలు చేస్తూ తమ వల్లే ప్రాజెక్టు వచ్చిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసలు విషయంల గ్రహించిన ప్రజలు వారి పాదయాత్రలకు దూరంగా ఉన్నారన్నారని అన్నారు.

Back to Top