‘వైఎస్సార్ ఒక చరిత్ర’

కాకినాడ: మహానేతపై ‘ వైయస్ఆర్ ఒక చరిత్ర’ పేరిట రూపొందించిన సీడీని  వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి  సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవిష్కరించారు. తూర్పుగోదావరి కాకినాడలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి నిర్మాతగా, వై.రాము కథ, కథనం, దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సీడీలను జిల్లాలోని పార్టీ అభిమానుల కోసం సోమవారం ఇక్కడకు పంపారు. వీటిని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులకు పంచారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, కేంద్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, బీసీసెల్ కన్వీనర్ గుత్తుల రమణ, చేనేత విభాగం కన్వీనర్ పంపన రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు, కాకినాడ సిటీ కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, పార్టీ నాయకులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎన్‌ఎస్ రాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుబ్బల వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ పార్టీ కన్వీనర్ మంగం జాన్ ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top