వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజలే వెన్నుదన్ను: అంబటి

సత్తెనపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలే వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు తమ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మబోరని చెప్పారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిర్వక్ష్యం చేశారని గుర్తు చేశారు. పొరపాటున కూడా చంద్రబాబు అధికారంలోకి రారని ఆయన స్పష్టం చేశారు.

‘గడప గడపకు..’ విజయవంతం చేయాలి..
సత్తెనపల్లి పట్టణంలో మంగళవారం నుంచి ఈ నెల 11 వరకు చేపట్టే గడప గడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబటి కోరారు. గడప గడపకూ వెళ్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటామన్నారు. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఈ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తుందో వివరించడంతోపాటు జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాల గురించి ప్రజలందరికీ తెలియజేస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్ మహబూబ్, పార్టీ జిల్లా నాయకులు మామిడి రాము, పులివర్తి రత్నబాబు, పట్టణ పార్టీ నాయకులు గార్లపాటి ప్రభాకర్, సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం మండల పార్టీ కన్వీనర్లు మదమంచి రాంబాబు, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, తోటా ప్రభాకర్, పార్టీ నాయకులు ఇందూరి నరసింహారెడ్డి, పుల్లా పాల్‌ప్రసాద్, వెదుళ్ళపల్లి సుధాకర్, వరికూటి రామయ్య, హైదరాబాద్ సుభాని, కాలిబర్ జానీ, మద్దు రత్నరాజు, చిలుకా రమణయ్య, తుమ్మల వెంకటేశ్వరరావు, వల్లెం నరసింహారావు, రజని, కలి, రెడ్డిగూడెం కరీముల్లా, మద్ది వెంకటేశ్వరరావు, సుధానాయక్, మామిడి ప్రకాష్, జరిగే రామస్వామి, కోడిరెక్కదేవదాసు, విప్పర్ల పాండురంగారావు, ఆకుల వెంకటేశ్వర్లు, బోరుపోతు సద్గురులు, భవనం శివమ్మ, షేక్ ఫాతిమున్, ఆకుచోట దుర్గారావు, జానకి రామయ్య, యనమాల సింగయ్య, అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, కాశిరెడ్డి, షేక్ నబి, షేక్ జాన్‌పాల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top