<strong>ఏలూరు, 25 అక్టోబర్ 2012:</strong> పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు నవంబర్ 4న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆ రోజున పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో కొవ్వూరులో జరిగే కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సిపిలో చేరుతున్నారు. కాగా, జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జి కర్ర రాజారావు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు గురువారం తెలిపారు. తాను కూడా నవంబర్ 4న వైయస్‌ఆర్ సిపిలో చేరనున్నట్లు ప్రకటించారు. ఏలూరు శాసనసభ్యుడు మద్దాల రాజేష్ కుమార్ కూడా మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఇద్దరు నాయకులు పార్టీలో చేరనుండడంతో మరింత బలం చేకూరనున్నది.