ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందే...

15వ ఆర్థిక సంఘాన్ని  వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి, డీఎస్‌ కృష్ణ కలిశారు. ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేదని 15వ ఆర్థిక సంఘాన్ని అడిగామన్నారు. ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రత్యేకహోదా కోసం సిఫారసు చేయమని ఆర్థిక సంఘాని కోరినట్లు తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరామన్నారు. స్థానిక సంస్థల నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడం సరికాదన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై బోర్డును నియమించలేదని ఈ విషయాన్ని కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.వెనుకబడిన జిల్లాలకు నిధులు అధికంగా ఇమ్మని కోరామన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేయమని కోరినట్లు తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top