అల్టిమేటమ్ ఇవ్వగలరా..!

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాలుకల వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్
జగన్ అసెంబ్లీ వేదికగా కుండ బద్దలు కొట్టారు. ప్రత్యేక హోదా మరియు విభజన చట్టం
హామీల అమలు మీద శాసనసభలో తీర్మానం చేసిన సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఇక్కడ
బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు, అక్కడ మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారని
ఎండగట్టారు. రెండేళ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన
వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్న వేస్తున్నామని,
తీర్మానం వరకు బాగానే ఉందని చెబుతూనే, ప్రభుత్వం చేయవలసిన పనిని దిశానిర్దేశం
చేశారు. ‘‘నెల రోజులు గడువు ఇస్తాం. మీరు హామీలన్నీ అమలు చేయండి లేకపోతే కేంద్రం
నుంచి మా మంత్రుల్ని వెనక్కి తీసుకొంటాం ’’ అని అల్టిమేటమ్ ఇవ్వగలరా అని వైఎస్ జగన్
నిలదీశారు. రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నామని, అక్కడ నుంచి మాత్రం సరైన స్పందన
కనిపించటం లేదని పేర్కొన్నారు. దీని మీద అధికార పక్షం పెడర్థాలు తీస్తూ వెళ్లింది.
దీంతో పాటు తీర్మానం ప్రతిలో వెనుకబడిన జిల్లాలను ప్రస్తావించారని, ఇందులో రాయలసీమ
జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా ను కూడా కలపాలని కోరారు. 

Back to Top