అంబేద్కర్ కు ఘన నివాళి

హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కు ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఘన నివాళి అర్పించారు. అసెంబ్లీ లో అంబేద్కర్
125వ శత జయంతి ఉత్సవాల మీద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ విదేశాల్లో
అత్యున్నత చదువులు చదివిన అంబేద్కర్ స్వదేశానికి తిరగి వచ్చి ఎన్నెన్నో సేవలు
అందించారని కొనియాడారు. పేదలు, దళితుల కోసం పనిచేశారని పేర్కొన్నారు. ఆయన చదువులు,
అనుభవం, అర్హత ను పరిగణన లోకి తీసుకొని రాజ్యాంగ రచన కమిటీ కి అధ్యక్షునిగా
ఎన్నుకొన్నారని గుర్తు చేశారు. పేదలు, దళితుల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో
పనిచేశారని వైఎస్ జగన్ కొనియాడారు. 

Back to Top