చట్ట విరుద్ధంగా గిరిజన సలహా మండలి

విజయనగరం: తెలుగుదేశం పార్టీ నాయకులను గిరిజన సలహా మండలిలో సభ్యులుగా ఎలా చేస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు ట్రైబల్‌ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. గిరిజన సలహా మండలి ఏర్పాటుపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గిరిజన ఎమ్మెల్యేలకు సలహామండలిలో చోటు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు కానివారిని కమిటీలో సభ్యులుగా ఎలా నియమిస్తారని నిలదీశారు. చంద్రబాబుకు గిరిజనుల అభివృద్ధి పట్టదా అని విరుచుకుపడ్డారు. కమిటీలో ఎమ్మెల్యేలకు చోటు కల్పించకపోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. 

Back to Top