తూ.గో. జిల్లాలోకి షర్మిల యాత్ర

కొవ్వూరు, 03 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. పాదయాత్ర 169వ రోజున సాయంత్రం గోదావరి నదిపై ఉన్న రోడ్డు, రైలు వంతెన మీదుగా ఆమె రాజమండ్రి పట్టణంలో అడుగుపెడతారు.

తొలుత మంగళవారం ఉదయం కొవ్వూరు పట్టణంలో మెరక వీధి, బస్టాండు సెంటర్, విజయవిహార్, సీతారామరాజు చౌక్, ఆంధ్ర సుగర్సు మీదుగా నడుస్తారు. శ్రీమతి షర్మిల అక్కడ భోజన విరామం తీసుకుంటారు. తదుపరి రోడ్డు,రైలు వంతెన మీదుగా రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం మెయిన్ రోడ్డు, అప్సర థియేటర్ మీదుగా వెళ్ళి సెయింట్ పాల్ చర్చిలో రాత్రి బస చేస్తారు. మంగళవారం ఆమె మొత్తం 13 కిలోమీటర్లు నడుస్తారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం చెప్పారు.

Back to Top