క‌రువుపై వైయ‌స్ఆర్‌సీపీ పోరు

వైయ‌స్ఆర్ జిల్లా: నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశ వైఖరి అవలంభిస్తోంది. పరిహారం ఇవ్వకుండా కేవలం ప్రకటనలతో ముడిపెడుతూ కాలం వెళ్లబుచ్చుతోంది. ఈమారు కూడా కరువు మండలాలు ప్రకటన మినహా ఎలాంటి చేయూత కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా సోమవారం కడప కలెక్టరేట్‌ ఎదుట వైయ‌స్ఆర్‌ సీపీ ధర్నా చేపట్టింది.  కేంద్ర ప్ర‌భుత్వం సాయం చేసినా రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు ఇన్‌ఫుట్ స‌బ్సిడీ, న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా మ‌హాధ‌ర్నా చేప‌ట్టిన‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ  రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు కొత్తమద్ధి సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కా రం కోసం వైయ‌స్ఆర్‌సీపీ  అవిశ్రాంత పోరాటం చేస్తుందని  వారు తెలిపారు.  వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన ధర్నాలో జిల్లాలోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Back to Top