తిరుపతి రాజీవ్‌నగర్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ రణభేరి

తిరుపతి, 2 జూన్‌ 2013:

తిరుపతిలోని రాజీవ్‌నగర్ మేజర్ గ్రామ పంచాయతీ‌లో ఆదివారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రణభేరి మోగించింది. గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జనం ఈ మహాధర్నా కార్యక్రమానికి తరలివచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్‌నగర్‌లో 50 వేల మంది జీవిస్తున్నారని, కనీస వసతులు, డ్రైనేజీ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్ రెడ్డి ఈ పంచాయతీకి నిధులు మంజూరు చేస్తానని చెప్పి మోసం చేశారని‌ ఆయన ఆరోపించారు. గ్రామ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర అర్ధరాత్రి వేళ మనుషులు తిరగని సమయంలో చేశారని, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ అధినాయకుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మండుటెండలో చేస్తున్నారని తెలిపారు. శ్రీ జగన్ ‌సిఎం అయిన తక్షణమే రాజీవ్‌నగర్‌ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని భూమన చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top