తిరుపతిని 'చెత్త'గా మారుస్తున్నారు: భూమన

తిరుపతి:

తిరుపతిని సర్కారు చెత్త నగరంగా మారుస్తోందని తిరుపతి  ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితిని ఆయన గురువారం పరిశీలించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయిందని తెలిపారు. కనీస శుభ్రతా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దోబీఘాట్‌లో పరిస్థితిని చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పరిస్థితి మారకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపటడతామని కార్పొరేషన్ అధికారులను భూమన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి పర్యాటకులు విచ్చేసే ప్రాంతం ఉండాల్సింది ఇలాగేనా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి అధ్వాన పరిస్థితుల్లో ప్రజారోగ్యం ఏమై పోతుందని ఆయన ఆవేదన చెందారు.

Back to Top