ఉద్యోగులకు భద్రత కరువు

ఏపీ అసెంబ్లీ: రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత కరువైందని, ఉద్యోగులకు  ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యోగుల సమస్యలపై ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులపై ప్రభుత్వ విధానం సరిగా లేదని ధ్వజమెత్తారు. చట్టానికి వ్యతిరేకంగా అధికారులపై ఒత్తిడి పెంచి పనిచేయించుకోవడం, ప్రతి జిల్లాల్లో లక్ష ఎకరాలకు ల్యాండ్‌ బ్యాంకింగ్‌ అంటూ టార్గెట్‌ పెడుతున్నారని విమర్శించారు. నిన్న జరిగిన ఉదాంతంపై సభలో చర్చించాల్సిన అవసరం ఉంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిపై టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు.

Back to Top