కేసులకు భయపడే ప్రసక్తే లేదు

అమరావతిః రైతుల సమస్యలపై పోరాడుతున్నందుకే ప్రభుత్వం తనపై కేసులు పెడుతోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులోఅడ్డంగా దొరికినా ఆయనపై ఎలాంటి కేసులు లేవని అన్నారు.  ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైయస్సార్సీపీ రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అభిప్రాయాలను మినిట్స్ బుక్ లో రాయమన్నందుకు ఆర్కే సహా 13మంది  రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది.

Back to Top