తలలపై ఇరుముడులు.. వైయస్‌కు నివాళులు

ఇడుపులుపాయ, 2 సెప్టెంబర్‌ 2012: వైయస్సార్‌ మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు భక్తి ప్రపత్తులతో నివాళులు అర్పించేందుకు పలువురు ఇరుముడులు ధరించి ఇడుపులుపాయకు తరలి వచ్చారు. వైయస్‌ అంటే తమకు ఎంతో అభిమానమని, ఆయనను మరచిపోవడం అసాధ్యమని వారు చెప్పారు.

అందుకే, వైయస్‌ను తమ గుండెల్లో దాచుకున్నామని చెప్పారు. తెల్లటి దుస్తులను, తలపై ఇరుముడులను ధరించిన వారు వరుసల్లో ఆశీనులై వైయస్‌ను ప్రస్తుతిస్తూ, ప్రజలందరికీ ఆయన చేసిన మేళ్లను ప్రస్తావిస్తూనినాదాలు చేశారు.

Back to Top