తెలుగు దేశంలో గుబులు పుట్టిస్తున్న షర్మిల

షర్మిల యాత్ర ముందు చంద్రబాబు పాదయాత్ర వెలవెలబోతుందేమోనన్న భావన తెలుగుదేశం శ్రేణుల్లో నెలకొంది. పార్టీ కార్యకర్తలు ఈ క్రమంలో దిక్కుతోచని స్థితిలో పడ్డారన్న సంకేతాలు వెలువడుతున్నాయి.  జగన్‌ను జైలులో ఎందుకు పెట్టారు.. మీరు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి షర్మిలను ప్రశ్నించడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌తో తెలుగుదేశం కుమ్మక్కు కారణంగానే జగన్ జైలుకెళ్ళిన విషయం తెలుసుండీ ఇలా ప్రశ్నించడం షర్మిల పాదయాత్రపై పార్టీలో నెలకొన్న గందరగోళానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కవడం, తదితర అంశాలను ప్రస్తావిస్తూ షర్మిల యాత్ర సాగిస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారు.
 
ముప్పై ఏళ్ళ ప్రాయంలో ఉన్న షర్మిల షష్టి పూర్తిచేసుకుని రెండేళ్ళయిన చంద్రబాబుకు ఏమాత్రం సరితూగరనీ, ఆయన యాత్ర ముందు ఆమె పాదయాత్ర దిగదుడుపవుతుందనీ తెలుగు దేశం పార్టీ మరో నాయకుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ రెండు అభిప్రాయాలను సునిశితంగా పరిశీలిస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ తాజా నిర్ణయంతో టీడీపీ ఎంత గందరగోళానికి గురవుతోందో తేటతెల్లమవుతోంది.  షర్మిల తలపెట్టిన మహా పాదయాత్ర పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తుందనీ, సూపర్ హిట్ అవుతుందనీ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మహానేత కుమార్తె షర్మిల తలపెట్టిన యాత్ర దేశంలోనే ప్రథమమనీ, ప్రపంచవ్యాప్తంగా అందరినీ దృష్టినీ ఆకర్షిస్తోందనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తాజా వీడియోలు

Back to Top