హైదరాబాద్ః హామీలు నెరవేర్చిన తర్వాతే కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళాలని తెలంగాణ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే లక్షన్నర ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలన్నారు. తెలంగాణలో 2.70 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానన్నారని కానీ 10 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారని విమర్శించారు. ఇప్పుడు ఏవిధంగా ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.