దోచుకొనేందుకే టీడీపీ నేతలకు శిక్షణ

() దోచుకోవటంలో టీడీపీ శిక్షణ

() దోపిడీ కి టీడీపీ మార్కులు

() లోకేశ్ ఆంధ్ర నయీం

విజయవాడ)) రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవటంలో శిక్షణ ఇచ్చేందుకే టీడీపీ
శిక్షణ తరగతులు ఏర్పాటయ్యాయని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి గౌతమ్ రెడ్డి అభిప్రాయ
పడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

  ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను ఎలా దోచుకోవాలి,  ఆక్రమ ఆస్తులను ఎలా దాచుకోవాలో దిశా నిర్దేశం
చేసేందుకే  టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారని
ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బాబు మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. రాబోవు
ఎన్నికల్లో డబ్బు ముఖ్య భూమిక పోషిస్తుందని ఒక్కో ఎమ్మెల్యే కనీసం రూ. 40కోట్లతో సిద్ధంగా ఉండాలని చెప్పడం
సిగ్గుచేటన్నారు. చినబాబు,
పెదబాబులిద్దరూ
ధన దాహంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెరలేపారని తెలిపారు.
వారిద్దరి అడుగుజాడల్లోనే ఎమ్మెల్యేలు కూడా అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కడం
అన్నది రాష్ట్రానికి అంత మంచిది కాదన్నారు. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకుల
మధ్య ఉందని సాక్ష్యాత్తు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒకవైపు చెబుతుంటే
ఇంకోవైపు నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మూటలు సర్దుతున్నారని ఎద్దేవా చేశారు. 

 

ఆంధ్ర నయీం

ఆంధ్రా నయీంగా నారా లోకేశ్ తయారయ్యాడని గౌతంరెడ్డి దుయ్యబెట్టారు.
ప్రతి పనిలోనూ కూడా ఆయనకు ముడుపులు ముట్టచెప్పాల్సిందేనన్నారు. రూ.కోట్లు ఎలా
సంపాదించాలన్న దానిపైనే టీడీపీ వర్క్‑షాప్ జరిగిందని ఎద్దేవా చేశారు. మూడు రోజుల
పాటు జరిగిన ఈ వర్క్ షాప్‑లో ఒక్కో ఎమ్మెల్యే రూ.40 నుంచి 50 కోట్లు
సంపాదించాలని బాబు సూచించారన్నారు. అవినీతిలో కోట్ల రూపాయలు సంపాదించిన వారికే 'ఏ' గ్రేడ్
ర్యాంకులిచ్చారని గౌతంరెడ్డి అన్నారు

బాబే సూత్రధారి... 

పలు నేరాల్లో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి, అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలకు పాల్పడటమే కాకుండా అధికారులపై
దాడులు చేస్తున్న ఎమ్మెల్యేకు పనితీరు మదింపులో మొదటి ర్యాంకు ఇవ్వడం చూస్తుంటే
స్వయంగా బాబే దగ్గరుండి నేరాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పలు సందర్భాల్లో
వివిధ అవినీతి కేసుల్లో అడ్డంగా దొరికి పోయిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర నాయకుల పేర్లను ఆయన ప్రస్తావించారు. 

 

దొంగల ముఠా

 

నారా చంద్రబాబు నాయుడు.. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ముద్దాయి

నారా లోకేశ్‌.... 
ఏ కాంట్రాక్టు
ఒప్పుకున్నా వాటాలు

బోడె ప్రసాద్‌...  ఇంటర్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ 

బోండా ఉమ...    కారు రేసింగ్, సెక్స్‌ రాకెట్‌

మంత్రి పీతల సుజాత... రూ. 10లక్షల లంచాలతో ప్రసిద్ది

యరపతినేని శ్రీనివాస్‌... అక్రమ మైనింగ్‌ 

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... నకిలీ పత్తి విత్తనాలు  

మంత్రి నారాయణ... వేల ఎకరాల రాజధాని భూ కుంభకోణం

మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి.... ఐటీ శాఖ దాడిలో అక్రమాస్తులు

ఎమ్మెల్యే డీకె సత్యప్రభ... ఐటీ శాఖ దాడిలో వేల కోట్ల అక్రమాస్తులు

చింతమనేని ప్రభాకర్‌... ఇసుక మాఫియా, రౌడీయిజం, మహిళా    తహశీల్దార్‌పై దాడి 

వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ...  కాంట్రాక్టర్ల నుంచి రూ. 5 కోట్లు డిమాండ్

కోడెల శివరామకృష్ణ (స్పీకర్‌ తనయుడు) ... కాంట్రాక్టర్లకు బెదిరింపులు

 

విద్యుత్‌ ప్రాజెక్టు వెనక్కి ఎందుకెళ్లింది...

కర్నూలు జిల్లాలో అమెరికా కంపెనీ నిర్మించతలపెట్టిన 500 మెగా వాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు ఎందుకు
వెళ్లిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. టీడీపీ నాయకులు అడిగిన వాటాలు చెల్లించలేకే
అమెరికా కంపెనీ వెనక్కి తగ్గిందని తెలిపారు. చెప్పుకొంటూ పోతే ఇటువంటివి అనేకం
కనిపిస్తాయని చెప్పారు.

 

 

Back to Top