కదిరిలో వైయస్సార్‌సీపీలో చేరిన మైనారిటీలు

అనంతపురం: కదిరి పట్టణంలోని 12, 13వ వార్డుల్లో ఉంటున్న  టీడీపీకి చెందిన  మైనారిటీలు బుధవారం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. వీరందరికీ ఆయన పార్టీ కండువాలు కప్పి ఆ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరంతా మైనార్టీ యువ నాయకుడు తుమ్మల మైనొద్దీన్‌ సమక్షంలో చేరారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు తీరని అన్యాయం చేస్తోందని, ముస్లింలకు న్యాయం జరగాలంటే అది వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌తోనే సాధ్యమని నమ్మి తామంతా ఈ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. డా.సిద్దారెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యలపై బాగా స్పందిస్తున్నారని అందుకే డాక్టర్‌ సమక్షంలోనే పార్టీలో చేరాలని భావించి పార్టీలో చేరినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డా.సిద్దారెడ్డి మాట్లాడుతూ... ముస్లింలు లేని మంత్రి వర్గాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని, ఇప్పుడు చంద్రబాబు పాలనలోనే చూస్తున్నామన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి  మైనార్టీలకు రిజర్వేషన్‌ కల్పించడంతో ఎంతోమంది డాక్టర్‌లు, ఇంజనీర్లు, ఇంకా ఎన్నో కీలక ఉద్యోగాల్లో ఉన్నారని గుర్తు చేశారు.  మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే అది జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన వారిలో షఫి, ఖాసీం, బాబా, నూర్, షేక్‌మస్తాన్, షేక్‌ బాబ్జాన్, రఫిక్, పెద్ద ఖాసీం, షర్ఫొద్దీన్, ఫరీద్, బాషా, దొరరాజు, గోపాల్, జయచంద్ర, రియాజ్, ఖాదర్‌బాషా, ఇర్ఫాన్, ముబారక్, బాబాజాన్, అమానుల్లా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాద్యక్షుడు బాహవుద్దీన్, కౌన్సిలర్లు ఖాదర్‌బాషా, రాజశేఖర్‌రెడ్డి, జగన్, జిలాన్, మెగా అంజాద్, ఎహసాన్‌ తదితరులున్నారు.

Back to Top