<strong>ఎమ్మెల్యే సునీల్‌కుమార్ సమక్షంలో చేరిన 25 కుటుంబాలు</strong><br/>చిత్తూరు(చిన్నిరెడ్డిపల్లె): రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అవినీతి, అక్రమాలను చూసి సహించలేక తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడుతున్నారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం చిన్నిరెడ్డిపల్లె ముస్లింవాడ గ్రామంలో టీడీపీకి చెందిన 25 మైనారిటీ కుటుంబాలు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ... టీడీపీకి ఓట్లు వేసి మోసపోయామని, టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి పథకాల లబ్ది అందడం లేదన్నారు. దీనిపై అధికారులు, టీడీపీ నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. <br/>దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో పథకాల ఫలాలు అన్ని వర్గాల వారికి అందేవని ఈసందర్భంగా గుర్తు చేశారు. ఆయన కుమారుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే వైయస్సార్ ఆశయాలు నెరవేరుతాయన్న నమ్మకంతో వైయస్సార్ సీపీలో చేరామని తెలిపారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. వైయస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే అన్నివర్గాల అభ్యున్నతి సాధ్యమని ఎమ్మెల్యే సునీల్‌కుమార్ స్పష్టం చేశారు.