వైయస్సార్సీపీలోకి టీడీపీ నాయకులు

తూర్పు గోదావ‌రి జిల్లా(పెద్దాపురం) : చంద్రబాబు మోసపూరిత పాలనతో విసుగుచెందిన టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. పెద్దాపురం మండలం ఆర్ బీ కొత్తూరు నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలన రావాలంటే అది  వైయస్ జగన్ తోనే సాధ్యమని, ఆయన వెంట నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసందర్భంగా వారు పేర్కొన్నారు. వైయస్సార్‌ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు సమక్షంలో  సుమారు 100 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన పల్లా శ్రీనివాస్‌యాదవ్, రెడ్డి జయబాబు, వల్లూరి కృష్ణ చౌదరిల ఆధ్వర్యంలో యువకులు పార్టీ యూత్‌ మండల అధ్యక్షుడు గోపు సత్యకృష్ణ (మురళీ),  ఘంటా వీర్రాజు  (శేషు)ల సమక్షంలో పార్టీలో చేరారు. 

అనంతరం తోట సుబ్బారావునాయుడు మాట్లాడుతూ...  వైయ‌స్ రాజశేఖరరెడ్డి పేదల పాలిట‌ దైవమని, ఆ మహానేత పాలనను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఆ పాలన ఒక్క జగనన్నతోనే సాధ్యమన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. పార్టీలో చేరినవారికి సుబ్బారావునాయుడు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పెద్దాపురం వైయస్సార్సీపీ నాయకుడు చుండ్రు చిన్న మృతి పట్ల ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సామర్లకోట కౌన్సిలర్‌ కాళ్ళ లక్ష్మి నారాయణ, పార్టీ జిల్లా కార్యదర్శి ఆదరపురెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top