<br/><br/>ప్రజా సంక్షేమం కోసం వైయస్ జగన్ పడుతున్న తపన,కష్టం చూసి వివిధ పార్టీల నేతలు ఆకర్షితులవుతున్నారు.వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి.వైయస్ జగన్ సమక్షంలో పలాస మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ లక్ష్మీ,వైస్ ఛైర్మన్ దుర్గాప్రసాద్‌లతో పాటు నలుగురు కౌన్సిలర్లు పార్టీలోకి చేరారు.పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి వైయస్ జగన్ ఆహ్వానించారు.టీడీపీ హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ద్వారానే అభివృద్ధి సా«ధ్యమవుతుందనే నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరామని టీడీపీ మాజీ నేతలు అన్నారు.ప్రజలు చంద్రబాబును నమ్మి ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే నేడు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నాడని విమర్శించారు. వైయస్ జగన్ సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వైయస్ జగన్‌తోనే ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయన్నారు.వైయస్‌ఆర్‌సీపీ గెలుపుకు అహర్నిశలు కృషిచేస్తామని తెలిపారు.