<strong>- కొండా కుటుంబం వైయస్ఆర్‌సీపీలో చేరిక</strong>విజయనగరం: చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి షాక్ తగిలింది. నలభై ఏళ్లు టీడీపీలో ఉన్న కొండా కుటుంబం ఇవాళ వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరింది. పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు సోమవారం వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైయస్ఆర్‌సీపీ చేరారు. పీటీఎం ఎంపీపీ కొండా గీతమ్మ, ప్రత్యేక ఆహ్వానితులు కొండా సిద్ధార్థలు గతవారం టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సింగిల్‌విండో చైర్మన్ ఎం.భాస్కర్‌రెడ్డి, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. వీరు రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంకల్పయాత్రలో వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లికి చెందిన రేణుక గతంలో కాంగ్రెస్ ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా కొనసాగారు. రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్‌ను వీడారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీలో చేరి పార్టీ నాయకుల గెలుపు కోసం శ్రమించారు. టీడీపీలో సరైన గుర్తింపు లేకపోవడంతో గత కొంతకాలంగా వీరు అధికార పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. <br/>ఈ నేపథ్యంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలకు ఆకర్షితులై వైయస్ఆర్‌సీపీలో చేరారు. ద్వారకనాథరెడ్డి నాయకత్వాన్ని తామంతా బలపరచి, వైయస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామని వారు తెలిపారు.