వైఎస్సార్సీపీ నేతలపై పచ్చనేతల దాదాగిరి

గుంటూరు: పచ్చనేతలు అధికారమదంతో కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతూ బరితెగిస్తున్నారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సాతులూరు గ్రామానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు చితకబాదారు. దీంతో మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. దీనికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పచ్చరౌడీలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు. 
Back to Top