బాబు పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది

రాజంపేట (క‌డ‌ప‌):  రాష్ట్రంలో దుర్మార్గ పాల‌న న‌డుస్తోంద‌ని, ఈ బాబు పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు ఆకేపాటి అమ‌ర్‌నాథ్‌రెడ్డి,  రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొర‌ముట్ల శ్రీ‌నివాసులు, క‌డ‌ప ఎమ్మెల్యే అంజాద్‌బాష‌, మేయ‌ర్ సురేష్‌బాబులు అన్నారు. గురువారం ఆకేపాటి స్వ‌గృహంలో వారు విలేక‌రుల‌తో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్ర‌జ‌లు  క‌ష్టాలు ప‌డుతున్నార‌న్నారు. బాబు వస్తేజాబు వస్తుందని గత ఎన్నికల్లో నిరుద్యోగులను నమ్మించి వారిని నట్టేటా ముంచారన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక, చివరికి ఆత్మహత్యకు పాల్పడే పరిస్ధితులు తీసుకొచ్చిన ప్రభుత్వం ఎదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనేనన్నారు. ఇప్పుడు వరదలు వస్తుంటే ఆ నీటిని కూడా సంరక్షించుకోలేని దుస్ధితిలో తెలుగుదేశం పాలన కొనసాగుతోందన్నారు. నీరు–చెట్టు కార్యక్రమంతో తమ్ముళ్లు జేబులు నింపేందుకు దోహదపడుతోందని, వరదల సమయంలో వరదనీటి కాపాడుకోని భూగర్భజలాలు పెంచుకునే దిశగా ప్రభుత్వం ఆలోచించడంలేదన్నారు. కనీసం చెరువుల్లోకి నీళ్లు నింపేందుకు నీటిపారుదలశాఖ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ప్రజారోగ్యం అస్తవ్య‌స్థంగా మారిపోయిందన్నారు. జననేత జగన్‌మోహనరెడ్డి చేపట్టబోయే పాదయాత్రలో ప్రజలు సమస్యలపై దృష్టిసారిస్తారన్నారు.

Back to Top