టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైయ‌స్సార్సీపీ వైపున‌కు..!

గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే యాళ్లూరి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గిద్దలూరులో సోమవారం  విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డికి తాను ఆది నుంచి అభిమానినని, 2004 ఎన్నికల్లో తమ ప్రత్యర్థులకు టికెట్టు ఇచ్చిన కారణంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లానన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నేతలతో చర్చించి త్వరలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలోకి చేరనున్నట్లు తెలిపారు.
Back to Top