నంద్యాల నుంచే టీడీపీ పతనం ఆరంభం

పులివెందుల : ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అనర్హుడని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నంద్యాల పర్యటనలో చేసిన వ్యాఖ్యలు హేయమన్నారు. నేనిచ్చే పింఛన్, రేషన్, మేం వేసిన రోడ్లపైనే ప్రజలు తిరుగుతున్నారని మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఆయన ఆలోచించుకోవాలన్నారు. చంద్రబాబు అదంతా ప్రజల సొమ్ము అని మరిచినట్లు ఉన్నారన్నారు. బాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నట్లుందన్నారు. తనకు ఓటు వేయని గ్రామాలను ప్రక్కన పెడతాననడం బాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు వైయస్‌ఆర్‌సీపీకి  పెరుగుతున్న ఆదరణను చూసి చంద్రబాబుకు మతిభ్రమించి ఇలా మాట్లాడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ పతనం నంద్యాల ఉప ఎన్నిక నుంచే మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top