టీడీపీ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు..
శ్రీకాకుళంః టీడీపీ పాలనపై విసుగు చెంది వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ పార్టీల నాయకుల చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి.తాజాగా రాజమండ్రికి చెందిన 37వ వార్డు టీడీపీ మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదన్నారు.జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరామని తెలిపారు.పేదలకు ఇళ్లు,రుణాలు,పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు అందాలన్న లంచాలమయం అయిపోయిందన్నారు.టీడీపీలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు.అలాంటి పార్టీలో ఉంటే పేదలకు సేవ చేయలేమనే ఉద్దేశ్యంతో మంచి ఆశయాలు,సిద్ధాంతాలు కలిగిన వైయస్‌ఆర్‌సీపీలోకి చేరినట్లు తెలిపారు.పేదల కోసం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టారని, ఈ పథకాలు ద్వారా ప్రజలుకు మేలు జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోని పరిష్కరించడానికి వైయస్ జగన్ పాదయాత్ర చేసి ఎంతో కష్టపడుతున్నారన్నారు.