మత భావాలపై దాడి

హైదరాబాద్ః అభివృద్ధి పేరుతో దేవాలయాలను, మసీదులను కూల్చడం దారుణమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. హిందూ, మైనారిటీ మత భావాల మీద ప్రభుత్వం దాడి చేస్తోందని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండోమెంట్ భూములను మీ పార్టీవాళ్లకు కారుచౌకగా కట్టబెడుతూ...మీ ఆస్తులను కాపాడుకోవడం కోసం దేవాలయాలను కూల్చేస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పూజారులను అర్థరాత్రి పూట అరెస్ట్ చేసి మరీ 30 గుళ్లను కూల్చేయడం దుర్మార్గమన్నారు. మత భావాలను ప్రభుత్వం ఏమాత్రం గౌరవించడం లేదని పార్థసారథి ఫైర్ అయ్యారు.

Back to Top